Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మెన్ జయరాజ్
నవతెలంగాణ-మహేశ్వరం
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించాలని వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మెన్ జయరాజ్ అన్నారు. సోమవారం తుక్కుగూడ ఏడీఈ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ అధికారులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కానికే ఈ వేదికలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకుపోవాలని ఆయన అన్నారు. అక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యుత్ వినియో గదారుల పరిష్కార వేదికకు తెలియజేయాలని ఆయన అన్నారు. విద్యుత్ మీటర్ సమస్యలు, విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసు ఇచ్చుట, పేరు బదిలీ, సర్వీసు కేటగిరి మార్పు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫా ర్మర్ల మార్పిడి, బకాయిల చెల్లింపులు, విద్యుత్ సరఫరాకు సంబంధించినవి అధికారుల దృష్టికి తీసుకరావాలని ఆయన తెలిపారు. అక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే వినియో గదారుల వేదికకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. మహేశ్వరం, కందుకరూరు, పహాడీషరీఫ్ నుంచి పలువులు వినియోగదారులు వినియోగదారుల వేదిక దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను 45 రోజుల లోపు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ లలిత, ఫైనాన్స్ మెంబర్. శోభారాణి, మెంబర్ గజేందర్ డీఈ రాజరాంరెడ్డి, ఏడీ కేవీఎన్‌రెడ్డి, మహేశ్వరం, కందుకూరు, పహాడీషరీఫ్ ఏఈలు సుధాకర్‌రెడ్డి, రమేష్, బాషా విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.