Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్షాకోట్ గ్రామం శాంతినగర్ అదిపరాశక్తి కాలనీలో సీసీరోడ్డు, డ్రయినేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనుల ను చేయాలన్నారు. డ్రయినేజీ పూర్తి చేసిన తరువాతే సీసీరోడ్డు వేస్తామని ప్రజలకు హమీచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురా వాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్, కాలనీవాసులు పాల్గొన్నారు.