Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
యువత గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని నార్సింగి ఛైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు నేటి యువత ముందుకు రావాలన్నా రు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. క్రీడలు, మానసిక శరీరక ఉల్లాసానికి ఎంతో ఉపయోగ మన్నారు. 20 నుంచి 30 వరకు టీంలు పాల్గొంటాయని తెలిపారు. గెలిచిన టీంకు మొదటి బహుమతి రూ. 75వేలు, రెండో బహుమతి 25 వేలుతో పాటు బహుమ తులను ప్రదానం చేస్తామన్నారు. వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, మాజీ ఎంపీటీసీ నాగేష్‌యాదవ్, యువ నాయకులు సాయి కిశోర్, మాజీ మండలాధ్యక్షులు గణేష్‌సింగ్, మాజీ వార్డు సభ్యులు విష్ణు వర్థన్, వార్డు అధ్యక్షులు పర్వేద రాజు, చారి, చంద్రశేఖర్, పాపాలాల్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.