Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి టీఆరెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కంటే శ్రీశైలం మరొక్క సారి తన ఉదారతను చాటుకున్నారు.గ్రామంలో పేదిం టి ఆడ పడుచు కర్రె మల్లయ్య కూతురు శ్రీవాణి వివాహా నికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కంటే శ్రీశైలం మాట్లాడుతూ గ్రామంలో జరిగే ప్రతి ఆడపడుచు పెళ్లికి ఎదో ఒక రూపంలో తన వంతుగా సహాయం చేస్తున్నానని అన్నారు.పేద వారి పెళ్లికి ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు సత్యనారాయణ, నరేష్,మాజీ ఉప సర్పంచ్ ఆనంద్, శ్రీశైలం,అంజమ్మ, చెంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.