Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మొయినాబాద్
నాగరాజు కుటుంబాన్ని ఆదివారం పరా మర్శించి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సహాయ కార్యదర్శి కె.విద్యా సాగర్, బేగరి రాజు సంఘీభావం తెలి పారు. దళిత కుటుంబానికి చెందిన నాగరాజు, మైనారిటీ అశ్విని సుల్తానాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేక కులదర హంకార ధోరణితో నడిరోడ్డుపైన నాగరాజు హత్య చేసిన దుండగులు రాజ్యాంగ ప్రకారం చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశా రు. అశ్విని సుల్తానాను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో వికారాబాద్ నియోజకవర్గం ఇన్చార్జీ పెద్ది అంజయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి కె వినరు కుమార్, ఆలిండి యా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సం యుక్త కార్యదర్శి అప్పల రాజు పాల్గొన్నారు.