Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వతంత్ర సమరయోధులు కామ్రేడ్ తోడే అడివయ్య 19వ వర్ధంతి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబంమైన తోడే ఎంకమ్మా, బాలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు మొత్తం అయిదుగురు సంతానంలో రెండవ కూమారుడు అడివయ్య చిన్నప్పటి నుంచి తమ వ్యవసాయ పనులు చేస్తు ఉండేవాడు. గ్రామంలోని కటికే అనంతరాం అడివయ్య మంచి స్నేహితులు అప్పటికే నిజాం రాజరిక, పటేల్ పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తిరుగుబాటు జరుగుతున్న క్రమం. చింతపట్ల కరుణం శ్రీనివాసరావు దోర పెద్ద భూస్వామి 1600ఎకరాలు చింతపట్ల, దాత్ పల్లి, చీదేడ్, రంగా పూర్, ఎల్లమ్మ తండా, బోడకోండ వరకు పన్నులు, శిస్తులు సర్వ అధికారులు కలిగి మంది మార్భలంతో జట్కా బండి పైనవచ్ఛి తన పెత్తనం సాగించే వాడు ప్రజలు కరువు కాటకాలు పంటలు పండక కౌలు చేల్లించలేని స్థితిలో వుంటే తీవ్ర నిర్భందం సాగించే వాడు. ఇది చూసిన అడివయ్య కలత చెంది తన స్నేహితుడు అనంతరాంతో నిత్యం పరితపించే వాడు. ఇద్దరు కలిసి గ్రామస్తులను సమీకరించి నిజాం రాజరిక వ్యవస్థ పటేల్ పట్వారీ వాళ్ళకు వ్యతిరేక కార్యకలాపాలు చేయటం, కులవివక్ష అంటరానితనం నిర్మూలనకు కషి చేశారు. కాచం కష్ణ మూర్తి నాయకత్వంలో ఎర్రజెండా పక్షాన నిలిచి పేద ప్రజలను ఐక్యం చేసే పోరాటాలను నడిపిన యోధులు ఆయన జీవితాంతం నిరాడంబరంగా గడిపిన గొప్ప త్యాగదనుడు అడివయ్య.
తుది శ్వాస విడిచే వరకు తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి దోపిడి పీడనం ధైర్యంగా ఎండగట్టి భూమి అనే నినాదంతో అగ్రభాగాన నిలిచిన మహానాయకుడు తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రాచరిక జమిందారీ జాగీర్దారీ (నిజాం రాజరిక వ్యవస్థకు) వ్యతిరేకంగా హైదరాబాద్ సమీపంగా రాచకొండ కేంద్రంగా కాచం కష్ణమూర్తి నాయకత్వంలో పోచమోని జంగయ్య, కర్రే కోటప్ప, కూకుడాల జంగారెడ్డి, బర్లశివయ్య, శ్రీరాం వెంకటయ్య, చింతపల్లి హన్మంతరెడ్డి, కర్నాటి మల్లయ్య, కుమ్మరి నర్సింహ, కూకుడాల మల్లారెడ్డి, చింతకాయల జంగయ్య.వెంకట్ రెడ్డి, కటిక అనంతరాం, కమ్మరి రాములు, తోడే అడివయ్య, తదితరులు చుట్టూ గ్రామాలలో భూస్వాములకు వ్యతిరేకంగా కళారూపాలు యక్షాగానం అటలు పాటలతో మహిళలను, ప్రజలను యువకులను సంఘాలు పెట్టిన దున్నే వాడికీ భూమి కావాలని, వేట్టి చాకిరీ విముక్తి కావాలని నినాదంతో చైతన్యం చేస్తుంటే భూస్వాముల గ్రామ ఎజేంట్లైన నర్సింగ్ లచ్ఛులు-గౌడ వారి సమాచారంతోటి భూస్వాములు, చింతపట్ల పోలీసులు అక్రమ కేసులు బనాయించి కటికే అనంతరాం, కమ్మరి రాములు తోడే అడివయ్య గార్లను భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న కాలంలో 1947.నుండి 1949వరకు మహారాష్ట్ర లోని జాల్న జైల్లో రెండున్నర సంవత్సరాల పాటు శిక్ష అనుభవించారు. తిరిగి 1950 సంవత్సరంలో మరో 6 నేలలు హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో నిర్బంధించబడ్డారు. జైలులో అనేక కష్టాలను అనుభవించారు. అప్పటీకే జైల్లో ఉన్న తోటి నాయకులతో కార్యకర్తల సహాకారంతో చదువు నేర్చుకోని అక్షరాలు రాయడం పేపరు చదవటం చేసి సిద్ధాంతాన్ని. రాజకీయాలు అధ్యయనం చేసి సుశిక్షితుడైన , ప్రజా పోరాట నాయకుడుగా అడివయ్య తయారయ్యారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత చీదేడ్ గ్రామ మొదటి సర్పంచ్‌గా 1959 సంవత్సరం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నిరాటంకంగా 25సంవత్సరాలపాటు, రంగాపూర్, చీదేడు, దాత్పల్లి గ్రామాల ప్రజలకు పంచాయతీ సర్పంచిగా ఎనలేని సేవలు అందించిన ధన్యజీవి..
1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఢిల్లీకి కామ్రేడ్ కాచం కష్ణ మూర్తి, కామ్రేడ్ తోడే అడివయ్య వేళ్లారు.
1967లో పాలకోల్లులో జరిగిన సీపీఐ(ఎం) ఫ్లీనరీ మహాసభలో ప్రజాశక్తి తెలుగు దినపత్రిక పునరుద్ధరణ కోసం పార్టీ విరాళాల పిలుపునందుకోని తన భార్య మల్లమ్మ గారి మంగళ సూత్రాన్ని విరాళంగా ఇచ్చిన ఆదర్శ మూర్తి..తోడే అడవయ్య.
తను సర్పంచ్ ఉన్న రోజుల్లో రంగా పూర్ అబ్జర్వేట్రి ఏర్పాటు. రంగా పూర్ స్కూల్. చిదేడ్ లోని స్కూలు నిర్మాణం ఏర్పాటుకు తనకు వచ్చిన నేల నేల వేతనం వితరణ చేశారు.
గ్రామంలో అన్ని కూలాలకు కలిపి బస్తీ ఏర్పాటు చేశారు. 1972లో యాచారం మండలం నందివనపర్తి గ్రామానికీ తన పెద్ద కుమారుడు జానకి రాములుకు పెళ్లి సంబంధం కోసం వేళ్ళి అగ్రామంలో దుర్మార్గమైన రెండు గ్లాసుల పద్దతిని చూసి బర్ల శివయ్య ద్వారా పెద్ద పోరాటం నడిపాడు. అనేక గ్రామాల్లో పులి మామిడి, కడ్తాల , మొండి గౌరేల్లి బకరాం లక్ష్మయ్య బదంతో గౌరెళ్ళి కంచే పోరాటం. చింతపట్ల 100ఎకరాల మొదటి కోలు కంచే పోరాటం. రైతు కూలీ కౌలుధారి భూ పోరాటాలను నడిపించాడు. మొట్టమొదటి మహిళ సంఘం కందుల బక్కమ్మ, కందుల మల్లమ్మ. సంగం జంగమ్మ, సాకలి శీవమ్మలతో ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కౌలు దారుల పోరాటాలకు నాయకునిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో ఇబ్రహీంపట్నం శాసనసభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మేల్యేగా పోటీ చేశారు. 1987లో కేరళ రాష్ట్రం పాల్ ఘడ్ లో జరిగిన కిసాన్ సభకు ప్రతినిధిగా అడివయ్య వెళ్లారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచి వేయడానికి అనేక కుట్రలు జరిగినాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉద్యమాన్ని అణచివేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనేక కుట్రలు కుతంత్రాలు సాగించాయి. 1989లో కామ్రేడ్ మహబూబ్ పాషా నరహరిలను హత్య చేశారు. అట్లాగే మేడిపల్లిలో అలంపల్లి రోశయ్య, తిప్పాయిగూడలో యాదగిరిరెడ్డి హత్య గావించబడ్డారు. వేలాది మంది పై కేసులు పెట్టి నిర్బంధ కాండను కొనసాగించారు. ఎదిరించి ముందుకు సాగిన ఈ ఉద్యమంలో చివరి వరకు నిలబడిన వారిలో కామ్రేడ్ తోడే అడవయ్య ఉన్నారు. తన కూమారులను భాగ చదివించి సమాజ సేవకు తయారు చేశారు. పెద్ద కుమారుడు జానకి రాములు మండల సినియర్ అసిస్టెంట్ గా చిన్న కోడకు భాను చందర్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్‌గా కూతురు కమలమ్మలను చదువు కోవాలని మంచిగా ప్రోత్సహించారు. అయన సహచరి మల్లమ్మ 2001లో మరణీంచారు.
ఆయిన తాను ప్రజా పోరాటాలలో పాల్గొంటూ 2003మే నేల10 తారీఖున ఎర్ర జెండా ముద్దు బిడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజల మనిషి, కామ్రేడ్ తోడే అడివయ్య తుది శ్వాస విడిచారు. నేటి 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేదల ఆస్తులను, సంస్థలను అమ్మేస్తున్నారు.ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతుంది అవినీతి పెరిగిపోయింది. పేదల భూములను కారుచౌకగా దోచుకుంటూ కుబేరులుకు కట్ట పెడుతుంది. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఒక వైపు అధిక ధరలను పెంచడం స్వార్థపు రాజకీయాలు ప్రజలను పట్టించుకోవడం లేదు.ప్రజాధనంతో రాజకీయ నాయకులు పబ్బం గడుపుతున్నారు. దోపిడి వ్యవస్థ మార్పు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) పార్టీ అనేక పోరాటాలను సాగిస్తుంది. నేటి పార్లమెంటరీ వ్యవస్థలో ఓటు అనే ఆయుధాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ నోట్లో కట్టలతో కోనుక్కొని అధికారం చేలాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యలను విస్మరించే వారు నిండు చట్టసభల్లో కి వారి వ్యాపారాలు అభివద్ధి కోసం కాంట్రాక్టర్ల కోసం టెండర్ల కోసం టెండర్ల కోసం అక్రమ సంపాధనలు కాపాడుకోవడం కోసం అయా రాజకీయాల్లో చలామణి అవుతున్నారు కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థ మార్పు కోసం మనం ప్రజలను చైతన్యం చేసినప్పుడే కామ్రేడ్ తొడే అడివయ్య గారికి నిజమైన నివాళి నాని కోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.
- పెండ్యాల బ్రహ్మయ్య
సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు
ఫోన్:9912569662