Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలో ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్లో ఎంసీపీిఐ(యూ) కార్యాలయంలో డివిజన్ కార్య దర్శి కన్నాశ్రీనివాస్ భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటా నికి పూలమాలవేసి ఘననివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి చిన్న తనం నుంచే జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినా మహనీయుడన్నారు. బిఎన్‌రెడ్డి నైజాం కాలంలో రజాకార్లు అల్లరి మూకలు ప్రజలపై చేస్తున్న దాడులు దౌర్జన్యాలను ప్రతిఘటన చేసేందుకు కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. బిఎన్ మియాపూర్ డివిజన్ నాయ కులు ఇస్లావత్ దశరథ్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనుల భూములు కాపాడతానని పోరాడిన నాయకుడు, పేదల కు ఇల్లు కావాలని జీవితాంతం పోరాడాడని అన్నారు. అడవిలో గిరిజనులను ఇళ్లల్లో గడిపి ఎర్రజెండా ను మరింత ఎరుపు ఎక్కించి మట్టికి పోరు నేర్పిన వీరుడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అని కొనియాడారు. కార్యక్రమం లో పి భాగ్యమ్మ కర్ర దానయ్య, పల్లె మురళి, ఎల్ రాజు, విమల వై రాంబాబు, కే. రాజు, చందర్ డి.మధు సూదన్, సుల్తానా, డి లక్ష్మి, శ్రీనివాస్, ఎస్. రవి, డి నరసింహ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.