Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం
నవతెలంగాణ-షాబాద్
సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతి నిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం షాబాద్ మం డల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్రెడ్డి అధ్యక్షతన ఎంపీడీవో అనురాధ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా వ్యవసాయశాఖ అంశంపై ఏవో వెంకటేశం మాట్లాడు తూ..సకాలంలో రైతులకు రైతుబంధు, రైతుభీమా పథకాలు అందు తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్సమ్మానినిధి పథకం ద్వారా రైతులకు పదివిడతలుగా డబ్బులు రైతుల ఖాతాలో జమచేసినట్లు తెలిపారు. మండలంలోని సోలి పేట్, చందన్వెళ్లి, కొమరబండ, నాగర్కుంట, పోలారం తదితర గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను తీర్చాలని చెప్పిన రోజులు గడుస్తున్నాయి తప్పితే పరిష్కారానికి నోచుకోలేదని ఆయాగ్రామాల సర్పంచులు సభాదృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఏఈ నరేందర్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ పనులు కొన్ని గ్రామాల్లో పనులు నెమ్మదిగా జరు గుతున్నాయని వెంటనే చేయాలని కొందరు సర్పంచులు తెల్పడంతో తాము త్వరలోనే పరిష్కరిస్తామని మిషన్ భగీరథ ఏఈ శారద వివరించారు. అనంతరం ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినా ష్రెడ్డిలు మాట్లాడుతూ..అధికారులు, ప్రజాప్రతి నిధు లకు, ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జడలలక్ష్మీ, సర్దార్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్న స్వప్నానర్సింహ్మారెడ్డి, ఎంపీవో హన్మంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్, ఏఈలుశ్రీదివ్య, నరేందర్, శారద, వైద్యులు వరలక్ష్మీ, చంద్రశేఖరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైసర్లు సునీత, నాగమణి, ఏవొ వెంకటేశం, ఎపివో వీరాసింగ్, ఎపిఎం నర్సింహులు, ఎం ఈవో శంకర్ రాథోడ్, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.