Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నేనావత్ అనితవిజరు అన్నారు. మండలం లోని శంకర్ కొండ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మండల పరిషత్ నిధుల నుంచి నిర్మిస్తున్న మరుగుదొడ్డి, ప్రహరీగోడ నిర్మాణ పనులను సోమవారం ఎంపీడీఓ, సర్పంచ్ లచ్చి పత్యనాయ క్తో కలిసి ఎంపీపీ అనిత విజరు ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. మండలంలోఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలలో నెలకొన్న సమ స్యలను విడ తల వారిగా పరిష్కరించేందుకు కృషి చేసు ్తన్నట్టు చెప్పారు. పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నప్పుడే విద్యార్థులు చదువులో బాగా రాణి స్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, ఏఈ కృష్ణయ్య, ఎంపీఓ ఉషారాణి, వార్డ్ వార్డు సభ్యులు చందు, పాండు, రాజు, జంగయ్య, రాము పాల్గొన్నారు.