Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ - మీర్ పేట్
నేర రహిత తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. టిఎస్ఐఐసీ, సిఎస్ఆర్ ఆధ్వర్యంలో రూ. 3 కోట్ల 50 లక్షల నిధుల తో జిల్లెలగూడలోని ఓ కన్వెన్షన్ లో 284 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఎస్ఐఐసీ, సిఎస్ఆర్ నిధులతో ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే రూ. 3 కోట్ల 50 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ని అభినందిం చారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో ఒక కోటి 20 లక్షలు, మీర్ పేట్ కార్పొరేషన్లో 25 లక్షలు, జల్ పల్లి మునిసిపాలిటీ 50 లక్షలు సీసీ కెమెరాలకు కేటాయిం చడం శుభపరిణామమని అన్నారు. దేశంలోనే తెలం గాణ పోలీస్ నెంబర్ వన్‌గా నిలిచిందని, సాంకేతికతో రాష్ట్రంలో కేసులను 24 గంటల ఛేదించటానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో 9 లక్షల 20 వేల సీసీ కెమెరాల ఏర్పాటు దేశంలోని అన్ని రాష్టాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అందుకే తెలంగాణ రాష్ట్రం ఎలాంటి శాంతి భద్రతల సమస్యా లేకుండా ప్రశాంతంగా ఉందని తెలిపారు. అందుకే రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అందులో పోలీస్ శాఖవే 20 వేల ఉద్యోగాలు ఉండటం గమనార్హం పేర్కొన్నారు. హైదరాబాద్ సేఫ్ సిటీగా పేరొందింద ని సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు కళశాలలలో, యువజన సంఘాలలో డ్రగ్స్‌పై ఇతర మత్తు పదార్థా లపై యువతకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఖాళీ ప్రదేశాల ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఇళ్ల ముందు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల పనితీరు వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఐటి సెల్ శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహాం శేఖర్, జల్పల్లి చైర్మన్ అబ్దుల్ షాది, టిఎస్ఐఐసి సిజిఎం, మీర్ పేట్, బాలాపూర్, పహడి షరీఫ్ ఇన్స్పెక్టర్లు మహేందర్‌రెడ్డి, భాస్కర్, వెంకటేశ్వర్లు, అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.