Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతుందని జిల్లా అధ్యక్షులు సంజీవ్ అన్నారు. మంగళవారం ఆయా మండలాల జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్న లిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నా రు. గడువు పొడగిస్తున్న అక్రిడేషన్ కార్డుల స్థానంలో వెంటనే నూతన అక్రిడేషన్లు జారీ చేయాలని, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డు లు వర్తించేల జీవో జారీ చేయాలన్నారు. వెంటనే ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలి స్టులు చంద్రశేఖర్, శివ భాస్కర్ రెడ్డి, విశ్వయేంద్రచారి పాల్గొన్నారు.