Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న 167 ఎన్హెచ్హైవే లింకు రోడ్డు పనులను మంగళవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచా లన్నారు. మహబూబ్ నగర్ నుంచి మంజూరైన హైవే రోడ్డుకు కాగ్నా నది నుంచి గౌతాపూర్ రోడ్డు వరకు రూ. 27 కోట్లతో చేపడుతున్న హైవే లింకు రోడ్డు పనులు, పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద చేపడుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగ తిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూ రు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.