Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
నవతెలంగాణ-దోమ
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వ హిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన అన్ని విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇంటర్ మొదటి సంవత్సరం 9,350, రెండవ సంవత్సరం 8,215 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరువుతున్నారని తెలిపారు.ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిముషం ఆలస్యం కాకుండా సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, ఉపతహసీల్దార్ రాజేందర్ రెడ్డి, ఆర్ఐ లింగం, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.