Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాంగో ఎక్స్ ప్రెస్ సేవలను వినియోగించుకోండి
- టీయస్అర్టీసీ ఎండీ సజ్జనార్
- మొదటి కస్టమర్ ఇంటికి వెళ్ళి స్వయంగా అందజేసి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ
నవతెలంగాణ- మియాపూర్
టీయస్ఆర్టీసీ సరికొత్త ఆలోచనలతో మ్యాంగో ఎక్స్ ప్రెస్ కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తమకు ఇష్టమైన బంగినపల్లి మామిడి పండ్ల రకాలు అందించే సేవలు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. మంగళవారం ఆన్లైన్లో బుక్ చేసుకొన్న వారిలో మొదటి కస్టమర్ బాచుపల్లిలో ఉం టున్న హేమ, కిరణ్ దంపతులకు ఆయనే స్వయంగా అందించి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ తరపున వారిని అభినందించారు. అనంతరం ఎండీ సజ్జనార్ మాట్లాడు తూ.. కార్బైడ్ వంటి రసాయనాలతో మామిడి కాయలను బలవంతంగా మగ్గించి మార్కెట్లో ఉంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. అలాంటి భయాలు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన పద్దతిలో మగ్గించి సరఫరా చేసేలా జగిత్యాల రైతులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. కోరిన వారికి వారం రోజుల్లో అందించేలా కార్గో సేవలను తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు 12 వేల మంది మామిడి పండ్ల కోసం సంప్రదించారన్నారు. అందరికీ గడువులోగా మేలు రకం బంగినపల్లి పండ్లను అందిస్తామన్నారు. కార్యక్రమంలో డిపో 1,2 మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.