Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడ్తాల్, ముద్విన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- ఎమ్మెల్యే జి జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ముద్విన్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగ ళవారం జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా తదితరులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమన గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, యాదయ్య గౌడ్, తులసీరామ్ నాయక్, ఎంపీటీసీలు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, లచ్ఛిరామ్ నాయక్, మంజుల చంద్రమౌళి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్ అలి, నర్సింహ, కోఆప్షన్ సభ్యులు జహాంగీర్ బాబా, ఉపసర్పంచ్లు రామకష్ణ, శారదా పాండు నాయక్, వినోద్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు సేవ్యా నాయక్, వెంకటేష్, వెంకటయ్య, ధుల్యా నాయక్, నాయకులు గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.