Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవా లనీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. అనంతరం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం మొక్కల పెంపకంలో భాగం గా నర్సరీని సర్పంచ్ కె.రాజిరెడ్డితో కలిసి జాయింట్ కలెక్టర్ సందర్శించారు. 'మన ఊరు-మనబడీ' కార్యక్ర మంలో భాగంగా దోమ పాఠశాలలను సంద ర్శించి పాఠశాల స్థితిగతు లను అడిగి తెలుసుకొన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నాగి రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లే షం, ఎంపీడీఓ జయరాం, తహసీల్దార్ షహాదా బేగం, ఏవో ప్రభాకర్ రావు, ఎంపీటీసీ అనితయాదయ్య గౌడ్, రైతుబంధు అధ్యక్షులు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ రాజ గోపాల చారి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆరెఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.