Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్సీలలో కార్పొరేట్ వైద్యం
- ఇందిరానగర్లో అర్బన్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే పైలెట్
రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పేదలకు మెరుగైన అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ 6వ వార్డులో అర్బన్ పీహెచ్సీ ఆస్పత్రిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లా డుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తోందన్నారు. నిరుపేద ప్రజలకు మెరు గైన వైద్యం అందించిన కోసం గ్రామాల్లో, పట్టణాల లోని వాడల్లో బస్తీ దవఖానలు, అర్బన్ పీహెచ్సీలను ఏర్పాటు చేస్తుందన్నారు. నిరుపేద లకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అందరికీ అందుబాటులో ఏర్పాటు చేస్తున్న పీహెచ్సీలోనూ మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. తాం డూరులో ఏర్పాటు చేసిన అర్బన్ పీహెచ్సీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారని, ల్యాబ్ సదుపాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిం చారు. తాండూరులో కాలుష్య రహితం, ఆరోగ్య తాం డూరుగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇండిస్టీయల్ పార్కు అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధి కారి డా. ధరణి కుమార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, భీంసింగ్, సంగీత ఠాకూర్, సాహు శ్రీలత, అంతారం లలిత, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.