Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎంసీ వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మండల పరిషత్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్ అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ సలహా మేరకు ఏఎంసీ వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్ మంగళవారం స్థానిక చిరు వ్యాపారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మండల పరిషత్‌తో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈవిషయమై ఇదివరకే పలు మార్లు మంత్రితో పాటు సంబందిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్టు తోట గిరియాదవ్ మంత్రికి విన్నవించారు.
దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాను కూలంగా స్పందించి వెంటనే ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం గురించి సూచించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కావలసిన నివేదికను రూపొందించి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు తోట గిరియాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీను, ఉపాధ్యక్షుడు రూపం వెంకట్ రెడ్డి, నాయకులు నరేందర్, మల్కేడి శ్రీనివాస్, అమర్ సింగ్, దోర్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.