Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత నేరస్థులను
- కౌస్సెలింగ్ ఏర్పాటు చేయాలి
- వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నకిలీ విత్తనాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలానికి రైతులు ఉపయోగించే విత్తనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో నకిలీ, నాణ్యతా లేని విత్తనాలు అమ్మినా, వాటి తయారు చేసిన వారిపైన ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అట్టి వారి పైన పిడి ఆక్ట్ నమోదు చేయాలని, విత్తనాలకు సంబంధించిన పాత నేరగాళ్లపైన దృష్టి పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేఆస్తమన్నారు. వ్యవసాయ అధికారుల సహాయంతో సీడ్స్ షాప్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే జిల్లాలో పెండింగ్ కేసుల అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి కేసులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు ఆక్సిడెంట్లు, ఆత్మహత్యలు జరుగుటకు కారణాలు తెలుసుకొని వాటిని తగ్గించాలని ఎక్కువగా నమోదు అవుతున్న పోలీస్ స్టేషన్లలో కళాజాత బృందంతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్ రైస్ అక్రమ రావాణాను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, తాండూర్, వికారాబాద్ డీఎస్పీ జిల్లా ఇన్స్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్లు, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.