Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేవెళ్ల
వంట గ్యాస్, ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి ఎం. ప్రభులింగం డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని బస్తే పూర్ గ్రామంలో సీపీఐ జెండాను ఆవిష్క రిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజ లపై ధరల భారం మోపుతున్నారని మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి మరింత భారం మోపడం చాలా దారుణ మన్నారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు అలా ్లడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా పెంచిన ధరలను తగ్గించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీ ఐ మండల ప్రధాన కార్యదర్శి సుధాకరౌడ్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి సత్యనారా యణచారి, నాయకులు సత్తిరెడ్డి, సుభాన్ రెడ్డి, కష్ణగౌడ్, అంజయ్య, రఘుపతి, బుచ్చయ్య, లక్ష్మీ నరసింహచారి తదితరులు ఉన్నారు.