Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రం తన నివాసంలో కులాంతర వివాహం చేసుకున్నవారికి ప్రభుత్వ ప్రోత్సాహక చెక్కులు అందజేశారు. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల 50 వేల చొప్పున, మరొ ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున అందజేశారు. అనంతరం టిబి వ్యాధి నివారణ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, కౌన్సిలర్ కిరణ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫిరంగి వెంకట్రాంరెడ్డి, మాజీ పటేల్, రవి తదితరులు పాల్గొన్నారు.