Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ రేణుక దేవి
నవతెలంగాణ-బంటారం
కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రేణుకాదేవి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా డీఈవో రేణుకాదేవి కేజీబీవీ పాఠశాలను సందర్శించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేస్తారనీ, దీని ద్వారా ప్రతీ పాఠశాలలో సంపూర్ణమైన మౌలిక సదుపాయలు కల్పన జరుగు తుందన్నారు. విద్యార్థుల సమస్యలను, ముందుగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఒత్తిళ్లకు గురికాకుండా చదువుకోవాలని సూచించారు. ఆమెతో పాటు మండల విద్యాధికారి చంద్రప్ప, బంటారం కేజీబీవీ స్పెషలాఫీసర్ శైలజ, కేజీబీవీ పాఠశాల ఇన్చార్జి రేణుక, సంతోష, నర్సింలు బబులు తదితరులు ఉన్నారు.