Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మనాయక్,
- జిల్లా అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-మంచాల
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ ధర్మనాయక్, జిల్లా అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కృష్ణమూర్తి భవన్లో నిర్వహించిన గిరిజన సంఘం మండల సదస్సులో వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలనీ, గిరిజ నులు సాగు చేస్తున్న భూములకు కాస్తు కాలంలో ఉన్న బూములకు రికార్డులు రాయాలని అన్నారు. ఇబ్రహీంపట్నంలో గిరిజనుల గురుకుల పాఠశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనీ,చదువుకున్న గిరిజన విద్యార్థులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ముఖ్యంగా గిరిజనులకు పది శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు నాయక్, బూరుగుల శ్రీను నాయక్, మండల నాయకులు కొర్ర రవీందర్, పంథ్యానాయక్, అంగోత్ లచ్చిరాం, జర్పుల కిషన్ నాయక్ తదితరులున్నారు.