Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్, జగదీర్గుట్ట పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు స్టేషన్ల పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డులనీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్లు, రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైం పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్,పనితీరు పరిశీ లించారు. అనంతరం సీపీ స్టిఫన్ రవీంద్ర , ఐపీఎస్ మాట్లాడుతూ గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా చేపడుతుంటే సమాచారం అంధించిన వెంటనే చర్యలు చేపడతామనీ, సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిం చాలన్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలని తెలిపారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై సీపీ సిబ్బందితో చర్చించారు. స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వివరించారు. సీపీ వెంట బాలానగర్ డీసీపీ సందీప్, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, బాలానగర్ ఇన్స్పెక్టర్ ఎండీ. వహీదుద్దీన్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజు, జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ సైదులు, డీఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.