Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచి ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ కాంట్రా క్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, మజిద్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యుత్ శాఖ సూపరిం టెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ కాంట్రాక్టర్లు పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కార్మికుల ఈఎస్ఎస్ఐ, పీఎఫ్ల్లతో పాటు సెస్‌లను కాంట్రాక్టర్ల నుంచి తొలగించాలన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లు అమలు చేయకపోతే ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, గోవింద రెడ్డి తదితరులున్నారు.