Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,
- డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో, ముజాహిద్పూర్ గ్రామంలో, చౌడాపూర్ మండల కేంద్రంలో, మరికల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మాత్రమే అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, కుల్కచర్ల ,చౌడాపూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.