Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సీఐ లక్ష్మిరెడ్డి, ఏంఏఓ రాగమ్మ
నవతెలంగాణ-మొయినాబాద్
మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే, కఠిన చర్యలు తప్పవని స్థానిక సీఐ లక్ష్మీ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి రాగమ్మ అన్నారు.మంగళవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని చిలుకూరు క్లస్టర్లో ఉన్న రైతు వేదికలో ఎరువులు విత్తన మండల డీలర్లకు సమవేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ లక్ష్మీరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ రైతులకు కాలం చెల్లిన,నకిలీ ఎరువులు, విత్తనాలు, అమ్మరాదని అమ్మినచో చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. మండల వ్యవసాయ అధికారి రాగమ్మ మాట్లాడుతూ ప్రతి డీలర్ ప్రభుత్వం ధ్రువీకరించిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సూచిం చారు. సంబంధిత రికార్డులను, బిల్బుక్, లైసెన్సులు తప్పకుండా మైంటైన్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ సునీల్ కుమార్, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.