Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
- ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నాయకులు
నవతెలంగాణ-దోమ
ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం నుండి 10 శాతానికి పెంచాలనీ జీవీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మైలారం గ్రామపంచాయతీలోని మంగలోని చెల్కతండాలో కరపత్రాలను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ఏలియాలోని జీవో ఎంఎస్. నెం. 3 ద్వారా వందశాతం రిజర్వేషన్లను అమలు జరపాలన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం నుంచి 11 శాతానికి పెంచాల న్నారు. ఎస్టీ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు, లావణి భూములకు పట్టాలు ఇవ్వాలనీ, ఏజెన్సీ ప్రాంతంలో జోనల్ వ్యవస్థకు సంబంధించి తెచ్చిన జీవో నెం. 317ను రద్దు చేయాలన్నారు. రిజర్వేషన్లను 'జీరో' చేస్తున్న ప్రయివేటీకరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. మైదాన ప్రాంత ఎస్టీ గిరిజనుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఐటీడీఏలను ఏర్పాటు చేసి, ఎస్టీల కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ నిధులను గిరిజనులు అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలన్నారు. ఎస్టీల గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ జిల్లా అధ్యక్షులు ఘట్యా నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ సూర్యానాయక్, ఎల్హెచ్పిఎస్, జీవీస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.