Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవాబుపేట
పనిచేయని విద్యుత్ ఏఈ మాకొద్దని మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం ఎం పీడీఓ కార్యాలయంలో కాళీ భవా నీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఏఈ తమకు వద్దని స్పష్టం చేశారు. అనంతరం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ కాలే జయమ్మ, వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ డాక్టర్ ప్రశాంత్‌గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రావుగారి వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దయాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు విజరుకుమార్, లక్ష్మమ్మ, పద్మ నాగిరెడ్డి, సర్పంచులు రత్నం, అంజయ్య, నర్సింలు, నరసింహా రెడ్డి, మాణిక్య రెడ్డి,చిట్టెపు బాలమణి, బాలవంత్రెడ్డి, పర్మయ్య పాల్గొన్నారు.