Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు యూత్ కాంగ్రెస్ నాయకుల వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో సుదీర్ఘకాలం తరువాత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిందన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలకు అఫ్లికేషన్ చేసుకోవడానికి రెసిడెన్సియల్, కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం ఉన్నాయని, ఇందుకు స్థానిక రెవెన్యూ ఆఫీసులో ధరఖస్తూలు చేసుకుని నెలల గడుస్తున్న ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.