Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి
- శంషాబాద్‌లో రూ.36 కోట్ల 80 లక్షల 30 వేల రుణాలు
- ముచ్చింతల్‌లో ఆరు దుకాణాలు ప్రారంభం
నవతెలంగాణ - శంషాబాద్
తెలంగాణ ప్రభుత్వం అందించే డ్వాక్రా రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థికం గా ఎదగాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితరెడ్డి సూచించారు. గురువారం శంషాబాద్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రూ.36 కోట్ల 80 లక్షల 38 వేల డ్వాక్రా రుణాల చెక్కులను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల బలోపేతానికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అ న్నారు. డ్వాక్రా భవనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలు ప్రభుత్వం అందించే రుణా లతో వ్యాపారాలు చేసుకొని వృద్ధిలోకి రావాలని సూచిం చారు. డ్వాక్రా సంఘాల రుణాలతో శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరు దుకాణాలను ఆమె ప్రారంభించారు. సంఘాల స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తున్న తీరును ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు అన్నిరంగాల్లో ఎదిగేందుకు సంపూర్ణ సహకారం అందిస్తుం దని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం కోట్లది రుణాలు తీసుకునే స్థాయికి శంషాబాద్ మహిళా సంఘాలు ఎదగడం అభినందనీయమని అన్నా రు. సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్వి రాజు, ఎంపీడీఓ వసంతలక్ష్మి, డీఆర్డీఏ ప్రభాకర్, డైరెక్టర్ జంగారెడ్డి, డీపీఎంఎస్ స్వర్ణలత, నిర్మల, నరసింహ, ఏపీఎం అహల్య, శ్రీనిధి సిబ్బంది పాల్గొన్నారు.