Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పత్రికనగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్లో గల పార్క్‌లో రూ.10 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడా నికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్య కర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతా యని, పార్కులోలో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయో గపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా పత్రికానగర్ అభివృద్ధికి కృషి చేస్తామని చేస్తామనీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకుల నీలం లక్ష్మీనారాయణ, పత్రికనగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సుధాకర్, ఉపాధ్యక్షులు ఎం. హేమసుందర్రావు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు, శివరాం, కోశాధికారి రామ్ కోటయ్య, సలహాదారులు డాక్టర్ బి.చంద్రకాంత్, ఎన్.ఎం.కె. మూర్తి సభ్యులు, ఆంజనేయులు, రామకృష్ణ, శివమోహన్, జీవేంద్ర, శేషాద్రి, నారాయణ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.