Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ విస్తరణ అధికారి అనిత
నవతెలంగాణ-కొత్తూరు
ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్దిదారులు ఆధార్ కార్డును మీ సేవ కేంద్రాల్లో అప్డేట్ చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిత అన్నారు. అందుకు ఈ నెల 31వ తేదీ నాటికి చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఈ-కేవైసీ నమోదు చేసుకునే రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు నని అలాగే మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చని అన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేసి ఈ-కేవైసీ అప్డేట్ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ను నమోదు చేయాలని అన్నారు. ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ని తిరిగి నమోదు చేస్తే అప్ డేట్ అవుతుందని తెలిపారు.