Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్, పీఎంఏవై పనుల ను పర్యవేక్షించేందుకు ఈనెల 15న ఎన్ఎల్ఎం టీమ్ సందర్శించనున్నట్టు జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హరితహారం, రైతు బంధు తదితర అంశాలపై ఎంపీడీఓ లు, ఎంపీవోలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, టీసీలు, గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్, పీఎంఏవై కింద క్రింద చేపట్టిన పనులను పర్యవేక్షిం చేందుకు ఈనెల 15న కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్ఎల్ఎం టీమ్ రానున్నదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన రిజిస్టర్లు, ఫైల్స్ సిద్ధం చేసుకొని అందుబాటులో ఉంచాలన్నారు. చేపట్టిన పనుల వద్ద వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ కార్యదర్శులు తమ, తమ జీపీల్లో జాబ్ కార్డులు అన్ని అప్డేట్ చేసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు సకాలంలో వారి డబ్బులు అందే విధంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి పోస్టల్ శాఖ ద్వారా అకౌంట్లు తెరుపించాలని, పోస్టల్ శాఖ అధికారులు నేరుగా గ్రామాలలోనే క్యాంపులు నిర్వహించి అకౌంట్లు తెరువనున్నట్టు గ్రామ కార్యదర్శులకు తెలిపారు. నాలుగు రోజులలో ప్రతి ఒక్కరికీ ఖాతాలు తెరిపించి ఎప్పటికప్పుడు వారికి డబ్బులు అందేలా చూడాలన్నారు. జిల్లాలో దళిత బంధు పథకం కింద 358 మందిని ఎంపిక చేసి గ్రౌండింగ్ కమిటీల ద్వారా 441 రకాల యూనిట్లను గ్రౌండ్ చేసినట్టు తెలిపారు. యూనిట్ల గుర్తింపు గ్రౌండింగ్ విషయంలో మండలాలల్లో, మున్సిపల్ పరిధిలో అధికారులు ఫైలింగ్ వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. షాపుల అద్దె విషయంలో రెంటల్ అగ్రి మెంట్, జాయింట్ మండల వెరిఫికేషన్ పత్రాలను సేకరిం చాలని తెలిపారు. ఆ తర్వాత బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు జరగాలని, లబ్దిదారులు ఒరిజినల్ బిల్లులు, రసీదులు దాఖలు చేసాలా ఎంపీడీఓలు చూసు కోని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్నారు. దళిత బంధు లబ్దిదారుల గోర్లు, మేకల షెడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా ఈసారి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేప ట్టాలని అన్నారు. శుక్రవారం నుంచి లక్ష్యం మేరకు గుం తలు పనులను చేపట్టాలన్నారు. హరితహారంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీఓ కృష్ణన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమొజెస్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డీపీవో మల్లారెడ్డి, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.