Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- గండిపేట్
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ దర్గా ఖలిజాఖాన్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి శంకరయ్య దంపతులు రూ. కోటీ 35 లక్షలతో మొబైల్ వావానాన్ని దత్తత ఇచ్చారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వావాహాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దాతల సహకారం అభినందనీయమన్నారు. కంటి పరీక్షలు చేసేందుకు వాహనాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షులు సురేష్‌గౌడ్, కార్పొరేటర్లు, ఎల్వీ ప్రసాద్ నిర్వహకులు, డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.