Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ గ్రామానికి చెందిన దొడ్డే భారతమ్మ యాదయ్య కూతురు మాధవి- కార్తీక్‌ల వివాహం గురు వారం శంషాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 13వ వార్డు కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి శ్రీకాంత్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.25 వేల నగదు అ మ్మాయి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆడపిల్లలు వివాహ ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.