Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రం సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ తండ్రి, చారకొండ ఎంపీపీ నిర్మల మామ గుండె బాల్నారాయణ గౌడ్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతిచెందారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చితరంజన్ దాస్, కల్వకుర్తి మాజీ జడ్పీటీసీ బాలస్వామి గౌడ్, తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ కార్యదర్శి, సుద్ధపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, మాజీ జడ్పీటీసీ రవితేజ, కో-అపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మెన్ గోపాల్ రెడ్డి, నాగర్కర్నూల్ బిసి సంఘం అధ్యక్షులు పెద్దయ్య యాదవ్, బీసీ సంఘం కల్వకుర్తి అధ్యక్షులు శేశి, ఇర్విన్ యాదయ్య, దళపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.