Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న స్థానిక నాయకులు
నవతెలంగాణ-గండిపేట్
నార్సింగిలో భూములకు రెక్కలు రావడంతో రియ ల్టర్ కన్ను వేశారు. గురువారం విషయం తెలుసుకున్న నార్సింగి, కోకాపేట్ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళ నకు దిగారు. నార్సింగి మున్సిపాలిటీలోని పోచారం గుట్ట పురాతన టెంపుల్ వద్ద దాదాపు 6 ఎకరాలపై స్థలం ఉంది. 226 6 ఎకరాల 8 గుంటల స్థలం ఉంది. టెంపుల్కు 3 ఎకరాల 8 గుంటలు ఉందని స్థానిక నాయకులు తెలిపారు. అయితే రాధా రియాల్టీ బిల్డర్ కొన్ని రోజుల నుంచి వెంచర్ల చేసేందుకు చదును చేస్తున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు గురువారం ఆందోళన చేశారు. కబ్జాదారులను అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు చేరుకుని అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు వచ్చి సరిహద్దుల ను ఏర్పాటు చేశారు. ఆక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మా ణాలను తొలగించారు. టెంపుల్ స్థలాన్ని కాపాడేందుకు స్థానిక నాయకులు చొరవ తీసుకోవడం సంతోషమని పలువురు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టెంపుల్ స్థలం కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, కాంగ్రె స్, బీజేపీ, స్థానికులు పాల్గొన్నారు.