Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్త రహిత సమాజాన్ని నిర్మిస్తాం
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
- 20 చెత్త ఆటోల ప్రారంభం
నవతెలంగాణ-గండిపేట్
అన్ని విషయాల్లో ప్రజలకు అండగా ఉంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీలో 20 చెత్త ఆటోలను ప్రారంభించారు. అనంతరం కోకాపేట్ ఐదో వార్డులో పలు అభివృద్ధి పనులకు పాలకవర్గ స భ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నార్సింగి మున్సిపాలిటీని చెత్త రహిత మున్సిపాలిటీగా తయారు చేస్తామన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికీ తిగిరి చెత్త సేకరణ చేయాలన్నారు. వార్డుకు 2 ఆటోలను అందించినట్టు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్ గజామాలతో ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మెన్ వెంకటేష్యా దవ్, కమిషనర్ సత్యబాబు, మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, కౌన్సిలర్ శివారెడ్డి, పత్తి శ్రీకాంత్‌రావ్, అమరేం దర్‌రెడ్డి, ఉషారాణి, అరుణజ్యోతి, సునీతాగణేష్, విజేతప్రశాంత్యాదవ్, పత్తి ప్రవీణ్‌కుమార్, మహిళా మండలాధ్యక్షురాలు పత్తి శోభరాణి, కో-ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.