Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సివిల్ సప్లై మేనేజర్ విమల
నవతెలంగాణ-దోమ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యంను కొనుగోలు చేసుకోవాలని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ విమల అన్నారు. గురువారం మండల పరిధిలోని దాదాపుర్ ఆయా గ్రామాల్లో డీసీఎంస్, పీపీసీ సెంటర్లను జిల్లా సివిల్ సప్లై మేనేజర్ విమల సందర్శించారు. అనంతరం గన్ని బ్యాగులు సెంటర్కు ఎన్ని వచ్చాయనీ, తూకం, మైస్చర్ తదితర విషయాలు ఇన్చార్జి గురుచరణ్ని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రల్లో మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.