Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్టు రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీంద్రా రావు వెల్లడించారు. గురువారం మండల పరిధిలోని కౌకుంట్ల, అంతారం జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈవో అక్బర్, ఏఈ హనీషా లను జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు, అదనపు తరగతి గదులు మరియు ఫర్నీచరు ఏర్పాటు లాంటి తదితర మొత్తం 12 అంశాలపై దృష్టిసారించి బడులను బాగు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పదో తరగతి ప్రి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగు సూచనలిచ్చారు. 23 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.