Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దాపూర్ సర్పంచ్ వడ్డే తులసమ్మ బాలయ్య
నవతెలంగాణ-కొత్తూరు
గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే తన లక్ష్యం అని సిద్దాపూర్ సర్పంచ్ వడ్డె తులసమ్మ బాలయ్య అన్నారు. గురువారం ఆమె ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మంజూరైన నిధులతో మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. సిద్దాపూర్ అంగన్వాడి భవనం, చింతగట్టు తండాలోని అంగన్వాడీ భవనం వద్ద మరుగుదొడ్ల పనులకు ఎంపీవో నరసింహతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గ్రామాభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్డే బాలయ్య, ఉప సర్పంచ్ ఫరీదా బేగం, వార్డు సభ్యులు పాండు, జంగమ్మ, సెక్రటరీ రవీందర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ సుబ్బారావు, అంగన్వాడీ టీచర్ గిరిజ, లక్ష్మి, ప్రాథమిక విద్యా కమిటీ చైర్మెన్ కృష్ణయ్య, కారోబార్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.