Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పందించని జలమండలి
- వారాకోసారి రాని నీళ్లు
- నీటి ఎద్దడిపై చర్యలు తీసుకోండి
- నార్సింగి కౌన్సిలర్ కె. ఉషారాణి
నవతెలంగాణ-గండిపేట్
నీటి సరఫరాల్లో అధికారులు నిర్లక్ష్యం వీడాలని నార్సింగి కౌన్సిలర్ కె. ఉషారాణి ఆరోపించారు. గురువారం నార్సింగిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నార్సింగి మున్సిపాలిటీలోని 17వ వార్డుల్లో జలమండలి అధికారులు నీళ్లు సరఫరా చేయడం లేదన్నారు. వారానికో సారి నీటిని సరఫరా చేయడం లేదన్నారు. జలమండలి మేనేజర్, ఇతర అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ వార్డుల్లో శుభాకార్యాలు, పెళ్లిళ్లు కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. కానీ అధికారులు నార్సింగి గ్రామానికి ఏ మాత్రం సరఫరా చేయడం లేదన్నారు. జలమండలి మేనేజర్, ఇటు కమిషనర్ నీటి సరపరా పట్ల నీర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రోజు ట్యాంకర్లతో నీటి సరఫరా చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పేదలు వేల రూపాయాలను పెట్టి ట్యాంకర్లు ఎలా కొంటారని ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా నీటిని సరఫరా చేయాలని కోరారు.