Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి
- పీఏసీఎస్ డైరెక్టర్ జెనిగ వెంకటేశ్
నవతెలంగాణ-మంచాల
రైతులు ప్రయివేట్ కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మోస పొవద్దని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్దిపొందాలని పీఎసీఎస్ డైరెక్టర్ జెనిగ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నోముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంకటేశ్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు దళారీల మాటలు నమ్మి ధాన్యం విక్రయించి, పోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం క్వింటాల్‌కు రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో పి.పర్వతాలు, మేఘవత్ బాబురావు తదితరులు ఉన్నారు.