Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో అకాల వర్షంతో రైతు జగతి అశోక్ మూడు ఎకరాల వరి పంట నేల వాలింది. ముందుగా సాగుచేసిన కొందరు రైతులు వరి పంటను కోసి కల్లాలో ఉండటంతో పొలాల్లోకి నీరు చేరి, రైతులు ఆందోళన చెందుతున్నారు.ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలకు అకాల వర్షంతో కన్నీరే మిగిల్చింది. నూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి తడిసి పోవడంతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి నేలతాకి పంట నష్టం జరగడంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో లేదోనని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని అధికారులతో అంచనా వేయించి నష్టపరిహారం ఇవ్వాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.