Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
రైతన్నలకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండలం అడవివెంకటాపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలు పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.