Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శిఖం భూములు ఎవరైనా కబ్జా చేస్తే, ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ఇరిగేషన్ ఎస్ఈ రంగారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో ఉన్న పెద్ద చెరువు శిఖం భూమి దగ్గర ప్రగతి రిసార్ట్స్ యాజమాన్యం అక్రమంగా రోడ్డు వేస్తే తొలగించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ శిఖం భూములు కబ్జాచేస్తే, సహించబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీఈ పరమేశ్వర్, ఆర్ఐ విక్రమ్ రెడ్డి, గ్రామస్తులు గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మయ్య ,హనుమంతు, వార్డు సభ్యులు అజం ధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.