Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో సమస్యలన్నింటికీ పరిష్కారం
- చైర్‌పర్సన్‌కు హామీనిచ్చిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్ అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్కు హామీనిచ్చారు. శుక్రవారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతితో నగరాల, పట్టణాల రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాదులోని వెంగళ్రావునగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్‌ను తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్లో నెలకొన్న అనేక విషయాల మున్సిపల్ శాఖ మంత్రికి వివరించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్లో నెలకొన్న సమస్యలన్నిటికీ త్వరలో పరిష్కారం చూపిస్తామని మంత్రి హామీనిచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్లో నెలకొన్న అధికారుల కొరత సమస్య కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు ఆమె వివరించారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని తమవంతు పూర్తి సహకారం ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్‌కు మంత్రి సూచించినట్టు తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కషి చేయాలని మంత్రి తెలిపారు.