Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
నవతెలంగాణ-మహేశ్వరం
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ను అడిగే దమ్ములేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అన్నారు. మహేశ్వరం మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ప్రజా సంగ్రామ యాత్ర మండల పరిధిలోని నాగులడోని తండా నుంచి మహేశ్వరం మీదుగా తుక్కుగూడకు శుక్రవారం బయలు దేరింది. ఈ సందర్భంగా బండి సంజరు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయన్నారు. పార్మాసిటీ భూములను గుంజుకుని రైతులకు మోసం చేసారని విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న తండాలకు నిధులు లేవన్నారు. అభివృద్ధి పేరిట కాంగ్రెస్లో గెలిచిన మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్లోకి చేరారనీ, ఇది కూడా వారి కుటుంబాల లాభాల కోసమేనని అన్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ను అడిగే దమ్ములేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జీ శ్రీరాములు నాయకులు వీరేందర్ గౌడ్, దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాదీష్, మండల అధ్యక్షుడు మాధవాచారి వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.