Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీల సమస్యలను పరిష్కరించడంలో విఫలం
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్
- ఉపాధి కూలీ డబ్బులు రాక పది వారాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉపాధి హామీ నిర్విర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని దండుమైలారంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కులీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.. 10 వారాలైన ఉపాధి కూలీల డబ్బులు చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పెరిగిన ధరలతో బతకలేకపోతున్నామన్నారు. పని ప్రదేశంలో కనీస అవసరాలు కల్పించాలని అన్నారు. ఉదయం పూట మాత్రమే పని చెప్పాలని అన్నారు. పెండింగులో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనిలో కొలతలు రద్దుచేసి ఉపాధి చట్టంలో నిర్ణయించిన ప్రకారం రోజు కులీ రూ. 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని అన్నారు. మాస్టర్లో తెలుగులో ఇంటి పేరుతో ఉండాలని, పనికి పొకపోతే పని రోజులు తగ్గే విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల ఉపాధి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బిల్లులను విడుదల చేసి ఉపాధి కూలీలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ అలవేన్స్ విధానాన్ని కొనసాగించాలని అన్నారు. ఉపాధి హామీని నీరుగార్చే కుట్రను మానుకోవాలని అన్నారు. ఉపాధి చట్టంలో నూతనంగా తెచ్చిన మార్పులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించా లని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి కూలీలతో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు మీసాల లింగస్వామి, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.